వైద్య సిబ్బందికి మెమోలు జారీ
13-12-2024 11:56 PM
నాగర్‌కర్నూల్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి జన్మదినం సందర్భంగా వైద్యశాఖ సిబ్బంది అత్యుత్సాహంతో పల్లె దవఖానాకు తాళంవేసి శుభాకాంక్షలు చెప్పేందుకు డ్యూటీ సమయంలో వెళ్లారు. దీనిపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.
నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ పల్లె దవఖానాను జిల్లా డిప్యూటీ వైద్యాధికారి వెంకటదాసు, మెడికల్ ఆఫీసర్ సంతోష్ అభిరాం శుక్రవారం సందర్శించారు. విజయక్రాంతిలో వచ్చిన కథనం ఆధారంగా విచారణ చేపట్టారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ దవఖానాకు తాళం వేయడాన్ని వారు తప్పుపట్టారు. అందుకు కారకులైన ముగ్గురికి మెమోలు జారీ చేశారు.






