25 August, 2026 | 11:34 AM

పేదల ఆత్మగౌరవానికి రేషన్ కార్డు

25-08-2026 11:01 AM

సిద్దిపేట రూరల్,ఆగస్టు 25: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తికావడంతో సిద్దిపేట రూరల్ మండలం సీతారాంపల్లి గ్రామంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్షుడు గుర్రం అంజిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా  అంజిరెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డు పేద ప్రజలకు కేవలం ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఉపయోగపడే పత్రం మాత్రమే కాకుండా, వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మల్లీశ్వరి, గ్రామ సర్పంచ్ చింతల రత్నాకర్ గౌడ్, ఉప సర్పంచ్ మిట్టపల్లి సుధాకర్, వార్డు సభ్యులు గుర్రం రాజశేఖర్ రెడ్డి, భూలక్ష్మి, సాయి,రామచంద్రం, డీలర్ రామచంద్రం, గ్రామ శాఖ అధ్యక్షుడు పోచంపల్లి స్వామి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు నాగరాజు, అమల, మల్లయ్య,ప్రమీల తదితరులు పాల్గొన్నారు