కోనేరు రంగారావు కమిటీ సిపార్సులు అమలు చేయాలి
రాష్ట్ర అధ్యక్షులు పాయం డిమాండ్
చర్ల,(విజయక్రాంతి): కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అమలు చేయాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ శనివారం జరిగిన ఒక సమావేశంలో డిమాండ్ చేశారు. షెడ్యూల్ ఏరియా, గోదావరి పరివాహక ప్రాంతాలైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పేరూరు నుండి విఆర్ పురం అలాగే వేలేరుపాడు నుండి ఏటూరునాగారం వరకు గోదావరి పరివాహ ప్రాంతాలలో గోదావరి అటు వైపు ఇటు వైపు ఉన్న సారవంతమైన ఆదివాసీల భూములు ఉండేవని ఆ భూములు ఇప్పుడు పరాయికరణ వలసవాదుల చేతుల్లోకి వెళ్లిపోయాయని ఆరోపించారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో షెడ్యూల్ ఏరియాలలో ఆదివాసీల భూముల అన్యాక్రాంతం పై. కోనేరు రంగారావు నేతృత్వంలోని ఒక కమిటీని ఏర్పాటు చేసి షెడ్యూల్ ఏరియాలో ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించి ఆదివాసీల అన్యాక్రాంత భూములపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసిందని గుర్తు చేశారు. కొమరం భీమ్ ఆదివాసీల పోరాట ఫలితమే నిజాం ప్రభుత్వం 13 47. Pasli ( క్రీ.శ. 1937 ). 1359. Pasli( క్రీ. శ. 1947). చట్టాల ద్వారా గిరిజన భూబదలాయింపు నిషేధ చట్టానికి పునాదులు వేశారని గిరిజనుల హక్కుల రక్షణ కోసం 1949 అక్టోబర్ 1న చట్టం తయారు చేయబడిందని 1946లో నిజాం ప్రభుత్వం తెలంగాణలో గిరిజనుల ప్రయోజనాలను కాపాడుటకై సాంఘిక సంక్షేమ శాఖ సంస్థ ఏర్పాటు చేసి గిరిజన ప్రాంతాలలో చట్టం చేశారని గుర్తు చేశారు.
ఏజెన్సీ ప్రాంతాలలో తేదీ 2 /6 /2014 సాదా బైనామా పామ్ అర్జీల ప్రాథమిక పరిశీల నివేదికలో ఎనిమిదవ కాలంలో దరఖాస్తులో కోరిన భూమి ఏజెన్సీ ఏరియా లో ఉండి ఏజెన్సీ చట్టం ఉల్లంఘన కిందకి వచ్చును అని స్పష్టంగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో రెవెన్యూ అధికారులుగా పనిచేసిన ఏజెన్సీ చట్టం ఉన్నదని చూడకుండా ఏమాత్రం పరిగణ లోకి తీసుకోకుండా ఉబ్బడి ముబ్బడిగా పైసలకు కక్కుర్తి పడి గిరిజనేతరులకు మరియు ప్రభుత్వ భూములకు పట్టాలు మంజూరు చేశారని ఆరోపించారు. కావున కోనేరు రంగారావు సిఫార్సులు ఏజెన్సీలో షెడ్యూల్ ఏరియాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.




