దమ్మపేట పంచాయతీ కార్యాలయంలో రికార్డులు చోరీ
దమ్మపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు కార్యాలయ తాళాలు పగులకొట్టి లోనికి ప్రవేశించి కీలక పత్రాలను అపహరించుకుపోయారు. ఈ సంఘటనపై దమ్మపేట ఎస్.ఐ. సాయి కిషోర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం సాయంత్రం విధులు ముగించుకొని యధావిధిగా పంచాయతీ కార్యాలయానికి తాళాలు వేసి ఉదయం 9.30 గంటల ప్రాంతంలో కార్యాలయం తలుపులు తెరవడానికి పంచాయతీ కార్యదర్శి బండి అనంత్ కుమార్ రాగా, కార్యాలయం ప్రధాన ద్వారం తాళాలు పగులకొట్టబడి వున్నవని, కార్యాలయంలోపల బీరువాను పగులకొట్టి అందులో వున్న కీలకమైన డాక్యుమెంట్లైన సిబ్బంది హాజరు పాత రిజిష్టర్, గ్రామ ఉప రిజిష్టర్, పాత యం.బి., 2024-25 సంవత్సరానికి సంబందించిన నగదు పుస్తకం, పాత ఇంటి పన్నుల పుస్తకాలు రెండు దొంగిలించబడ్డాయని దమ్మపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి బండి అనంత్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్తాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ. సాయికిషోర్ రెడ్డి తెలిపారు.






