17 April, 2026 | 3:19 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో రెడ్ రిబ్బన్ క్లబ్ కార్యక్రమాలు

26-03-2025 10:23 PM

డాక్టర్ సుధాకర్ గౌడ్..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల పరిధిలోని తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణం జాతీయ సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారంతో నేడు, రేపు రెడ్ రిబ్బన్ క్లబ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ గౌడ్ తెలిపారు. కార్యక్రమాల్లో భాగంగా హెచ్ఐవి ఎయిడ్స్, సుఖ వ్యాధులపై విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారనీ తెలిపారు. పోటీలను ప్రారంభిస్తూ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ గౌడ్ మాట్లాడారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు రేపు జరగబోయే "ఎయిడ్స్, సుఖ వ్యాధుల" పై అవగాహన కార్యక్రమంలో బహుమతులను అందజేస్తామని జాతీయ సేవా పథకం అధికారి డాక్టర్ అంజయ్య బందెల తెలిపారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ మోహన్ బాబు, డాక్టర్ ప్రతిజ్ఞ డాక్టర్ వీరభద్రం, డాక్టర్ అంజయ్య వ్యవహరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.