తగ్గిన విదేశీ మారక నిల్వలు
ముంబై, ఏప్రిల్ మే 31: వరుసగా మూడు వారాలపాటు పెరిగి రికార్డు గరిష్ఠానికి చేరిన విదేశీ మారక నిల్వలు తాజా సమీక్షావారంలో స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మే 24తో ముగిసిన వారంలో భారత్ వద్దనున్న ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) రిజర్వులు 2.027 బిలియన్ డాలర్ల మేర తగ్గి 646.673 డాలర్ల వద్ద నిలిచాయి. ఇవి మే 17తో ముగి సినవారంలో 4.55 బిలియన్ డాలర్ల మేర ఎగిసి ఆల్‌టైమ్ రికార్డుస్థాయి 648.7 బిలియన్ డాలర్ల వద్దకు చేరాయి. తాజాగా మే 24తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమై న విదేశీ కరెన్సీ ఆస్తులు 1.51 బిలియన్ డాలర్లు తగ్గి 567.499 బిలియన్ డాలర్ల వద్దకు చేరాయి.
బంగారం నిల్వల్లోనూ తగ్గుదల
దేశం వద్దనున్న బంగారం నిల్వలు సైతం సమీక్షావారంలో 482 బిలియన్ డాలర్ల మేర తగ్గి 56.713 బిలియన్ డాలర్ల స్థాయికి దిగివచ్చాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 33 మిలియన్ డాలర్ల తగ్గుదలతో 18.135 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఐఎంఎఫ్ వద్దనున్న రిజర్వులు కూడా 1 మిలియన్ డాలర్లు తగ్గి 4.326 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.






