24 August, 2026 | 10:23 PM

Breaking News

8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •  

రూ.27 వేల కోట్ల బంగారం బాండ్లను కొనేశారు

31-05-2024 02:30 AM

తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ జారీచేసిన సావరిన్ గోల్డ్ బాండ్స్ ఇన్వెస్టర్లను బాగా ఆకర్షించాయి. 2023 రూ.27,031 కోట్ల విలువైన గోల్డ్ బాండ్లను మదుపరులు కొనుగోలు చేసినట్టు ఆర్బీఐ వార్షిక నివేదికలో వెల్లడించింది. 2022 జరిగిన గోల్డ్ బాండ్ల కొనుగోళ్లకంటే 2023 జరిగిన పెట్టుబడులు 4 రెట్లు అధికం. భౌతిక బంగారం కంటే ఎక్కువ రాబడిని ఇవ్వడంతో పాటు పన్ను ప్రయోజనాలు సైతం లభిస్తున్నందున వీటిపై మదుపరులకు మోజు పెరిగింది. 

44 టన్నుల పసిడి కొనుగోలు

2023 ఇన్వెస్టర్లు కొనుగోలు చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లు 44.34 టన్నుల పసిడికి సమానం. 2022 12.26 టన్నుల బంగారానికి సమానమైన రూ.6,551 కోట్ల విలువైన బాండ్లను కొన్నారు. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నాలుగు విడతల్లో గోల్డ్ బాండ్లను జారీచేసింది. 2015 నవంబర్‌లో సావరిన్ గోల్డ్ బాండ్ల స్కీమ్ ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకూ 67 విడతల్లో రూ. 72,274 కోట్లు (146.96 టన్నులు) సమీకరించినట్టు ఆర్బీఐ తెలిపింది. గత ఏడాదికాలంలో 10 గ్రాముల బంగారం ధర రూ.62,300 నుంచి రూ. 73,200కు పెరిగింది. బాండ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత అప్పటి బంగారం ధర ప్రకారమే బాండ్‌హోల్డర్లకు ఆర్బీఐ చెల్లింపు చేస్తుంది. దీనికి తోడు 2.50 శాతం వార్షిక వడ్డీని సైతం ఇస్తుంది.