తగ్గిన ఇళ్ల సరఫరా
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 29 (విజయక్రాంతి): దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాలలో 2024 సంవత్సరం రెండో త్రైమాసికంలో కొత్త ఇళ్ల సర ఫరా తగ్గింది. గతేడాదితో పోలిస్తే 13 శాతం తగ్గింది. హైదరాబాద్‌లో ఏకంగా 36 శాతం తగ్గుదల నమోదైంది. గతేడాది క్యూ2లో 18,232 యూనిట్లు లాంచ్ కాగా, ఈ ఏడాది క్యూ2లో 11,603 యూనిట్లు మాత్రమే లాంచ్ అయ్యాయి. వరుస ఎన్నికలతో కొత్త ప్రాజెక్టులు లాంచ్ కాలేదని, ఈ క్రమంలోనే ఇళ్ల సరఫరా తగ్గిందని రియల్ ఎస్టేట్ డాటా విశ్లేషణ సంస్థ ప్రాప్ ఈక్విటీ తెలిపింది.
గతేడాది ఏప్రిల్-, మే, జూన్‌లో 1,11,657 యూనిట్లు లాంచ్ కాగా, ఈ ఏడాది 13శాతం తగ్గుదలతో 97,331 యూనిట్లు మాత్రమే లాంచ్ అయ్యాయి. జనవరి-, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికంతో పోల్చితే 7 శాతం తగ్గాయి. ముఖ్యంగా క్యూ2లో పుణె, హైదరాబాద్‌లలో తక్కు వ లాంచ్ కాగా, దేశ రాజధాని ఢిల్లీలో కొత్త యూ నిట్ల సరఫరా రెట్టింపు కావడం విశేషం. ఇక్కడ గతేడాది ఏప్రిల్-, జూన్‌లో 5,708 యూనిట్లు లాంచ్ కాగా, ఈ ఏడాది క్యూ2లో 95 శాతం పెరుగుదలతో 11,118 యూనిట్లు లాంచ్ అయ్యాయి. అలాగే బెంగళూరులో 21 శాతం పెరుగుదలతో 11,848 యూనిట్ల నుంచి 14,297 యూనిట్లకు పెరిగాయి.






