భరోసానిచ్చేది ఆ రెండు నగరాలే
దక్షిణాదిన రియల్ ఎస్టేట్ త్వరితగతిన వృద్ధి చెందేందుకు
అవకాశం ఉన్న నకరాల్లో రెండు ఏపీ నగరాలకు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా తాజా నివేదికలో చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో రియల్ వృద్ధికి భరోసా ఉందని పేర్కొంది. విశాఖపట్నం, తిరుపతిల్లో రియల్ పరుగులు పెడుతుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతితో పాటు విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం మంచి గ్రోత్ నమోదు చేసుకుంటుందని ఆ నివేదికలో తెలిపారు. -
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 29 (విజయక్రాంతి): ఏపీలో వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్టణాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించారు. 2024లో అధికారంలోకి వస్తే ప్రభుత్వ పరిపాలన విశాఖ నుంచే కొనసాగుతుందని ఏపీ మాజీ సీఎం గతంలో ప్రకటించారు. దీంతో అమరావతిలో రియల్ బూమ్ తగ్గి.. విశాఖలో పెరిగింది. అయితే, ఇటీవలి ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఓటమి పాలవడం, తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడంతో విశాఖ రియల్టీలో కొంత గందర గోళం నెలకొంది. అయితే విశాఖ రియల్టీకి భరోసా కల్పించేలా ఏపీకి రాజధాని అమరావతే అయినప్పటికీ, విశాఖను రాష్ర్ట ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించడంతో విశాఖ కేంద్రంగా వ్యాపారం చేస్తున్న రియల్ ఎస్టేట్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.
ఆధ్యాత్మిక, పర్యాటక పరంగా వృద్ధి చెం దే పట్టణాల్లో తిరుపతితో పాటు వారణా సి, షిర్డీ, పూరి, అయోధ్య, అమృత్‌సర్, ద్వార క నగరాలకు ఈ నివేదికలో చోటు దక్కింది. మొత్తం 100కుపైగా పట్టణాల్లో సమీప భవిష్యత్తులో రియల్ ఎస్టేట్‌కు మెరుగైన అవ కాశాలు ఉన్న 30 పట్టణాలను నివేదికలో వెల్లడించారు. వీటిలో 17 పట్టణాల్లో వేగవంతమైన వృద్ధికి అవకాశం ఉందని, ఈ జాబితాలో విశాఖ, తిరుపతితోపాటు కోచి, కోయంబత్తూర్, అమృత్‌సర్, అయోధ్య, జైపూర్, కాన్పూర్, లక్నో, వారణాసి, పాట్నా, పూరి, ద్వారక, నాగ్‌పూర్, షిర్డీ, సూరత్, ఇం డోర్ నగరాలున్నాయి.
ఇవన్నీ చాలా తక్కువ కాలంలోనే అధిక ప్రభావం చూపించే రియ ల్ ఎస్టేట్ స్పాట్లుగా మారతాయని ఆ నివేదికలో తెలిపారు. ప్రభుత్వం నుంచి విధాన పరమైన మద్దతుతోపాటు మౌలిక వసతుల అభివృద్ధి, ఆధ్యాత్మిక పర్యాటకం వంటి అంశాలు వీటి వృద్ధిలో కీలకం కానున్నాయని ఆ నివేదిక విశ్లేషించింది. మౌలిక వస తులు మెరుగుపడటం, అందుబాటు ధరలో ఇళ్లు, నైపుణ్యం కలిగిన మావన వనరులు వంటి అంశాలు చిన్న పట్టణాలు కూడా దేశ జీడీపీలో కీలకపాత్ర పోషిస్తున్నాయని కొలియర్స్ ఇండియా సీఈఓ బాదల్ యగ్నిక్ పేర్కొన్నారు. 2030 నాటికి భారత జీడీపీలో రియల్ రంగం వాటా లక్ష కోట్ల డాలర్లకు, 2050 నాటికి 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని ఆయన అంచనా వేశారు.






