పెద్దపులి ఆవాసం మాకొద్దు.. భవిష్యత్తు కోసమే పుణరావాసం
* జిల్లా అటవీ శాఖ కార్యాలయం ముట్టడిలో పునరావాస బాధితులు
* డీఎఫ్ వోకు వినతి పత్రం అందజేత
అచ్చంపేట: తామంతా స్వచ్ఛంధంగానే పుణరావాసాన్ని ఎంపిక చేసుకున్నామని పునరావాస బాధితులు స్పష్టం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని అమ్రాబాద్ మండలంలోని సార్లపల్లి, కుడిచింతలపైలు, తాటి గుండాల, కొల్లంపెంట గ్రామాలకు చెందిన పుణరావాసం బాధితులు సోమవారం అచ్చంపేటలోని హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారి వై జంక్షన్ నుంచి డీఎఫ్వో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆయా గ్రామాలకు చెందిన 417 కుటుంబాలు అటవీ శాఖ, మరెవరి బలవంతం లేకుండానే తామంతగా తాము స్వచ్ఛందంగా పిల్లల భవిష్యత్తు కోసం పునరావాసం ప్యాకేజీకి ఒప్పుకొని వెళుతున్నామని.. దాన్ని మరో విధంగా అపార్థం చేసుకోవద్దని కోరారు.
కొందరు తమను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. "భవిష్యత్తు కోసమే పునరావాసం.. " పెద్దపులుల ఆవాసం మాకొద్దు" కాలయాపన వద్దు పునరావాస ముద్దు " అనే నినాదాలతో జిల్లా అటవీ శాఖ కార్యాలయాన్ని ముట్టడిడించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి చిర్రాములు, ఉప సర్పంచ్ వెంకటయ్య, గ్రామ పెద్ద సత్తయ్య, పునరావాస నిర్వహణ కమిటీ సభ్యుడు విష్ణు తమ ఆవేదన వెలిబుచ్చారు. తమ తాత ముత్తాతల నుంచి నల్లమల అభయారణ్యం ప్రాంతంలో జీవిస్తున్నమని.. కానీ తమ జీవనానికి పూర్తిగా ఇబ్బందిగా ఉందని పంటలు పండే పరిస్థితి లేదని వన్యప్రాణుల ప్రభావం పెరిగిందని తెలిపారు.
సేద్యాన్ని నమ్మకొని ఏ పంట వేసుకున్న అడవి పందులు, ఇతర వన్యప్రాణుల నుంచి నష్టం వాటిల్లుతోందని.. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని తామంతా అడవి నుంచి వెళ్లడానికి ముందుకు వచ్చామని చెప్పారు. ఇందులో ఎవరి ఒత్తిడి లేదని తెలిపారు. ప్రభుత్వం తమ కోసం ప్రకటించిన పునరావాస ప్యాకేజీ నిర్ణయాన్ని త్వరగా అమలు చేసి తమకు పునరావాసం త్వరగా కల్పించాలని జిల్లా అటవీశాఖ అధికారి రేవవంత్ చంద్రకు బాధితులు వినతి పత్రం అందజేశారు.
దాన్ని గురించి డిఎఫ్ వో విలేఖరులతో మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో బలవంతంగా గిరిజనులను అడవి నుంచి తరలిస్తున్నారని వార్తలు వచ్చాయని.. దాంట్లో వాస్తవం లేదని ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని ఆ ప్రక్రియను అటవీశాఖ చర్యలు చేపడుతుందన్నారు. నాలుగు గ్రామాల ప్రజలు స్వచ్ఛంద నిర్ణయంతోనే పునరావాస ప్యాకేజీని అమలు చేస్తున్నామని మొదటి ప్యాకేజీలో పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికి పునరావాస ప్యాకేజీలో ఫేస్-1, ఫేస్-2 ద్వారా వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. బలవంతంగా తరలింపు అనేది ఆరోపణలు మాత్రమేనని అన్నారు.






