రీయింబర్స్‌మెంట్ విచారణ 6కు వాయిదా
01-07-2026 12:02 AM
హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన పిటిషన్లపై విచారణను రాష్ట్ర హైకోర్టు విచారణను వాయిదా వేసింది. ఈ నెల 6వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ కేసులో గత విచారణ సందర్భంగా జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు అప్పటి వరకు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
గత విచారణలో విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ప్రధానంగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయకూడదని పేర్కొంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.9లోని నాలుగు నిబంధనల అమలుపై కోర్టు తాత్కాలిక స్టే విధించింది. న్యాయస్థానం జారీ చేసిన ఈ మధ్యంతర ఉత్తర్వులు జూలై 6న జరిగే తదుపరి విచారణ వరకు అమల్లో ఉంటాయని కోర్టు పేర్కొంది.






