18 July, 2026 | 12:53 PM

Breaking News

సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

ఢిల్లీ పీఠంపై రేఖా గుప్తా

20-02-2025 12:49 AM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: బీజేపీ అధిష్టానం బుధవారం రేఖా గుప్తాను సీఎంగా ప్రకటించింది. ఆప్ అధినేత కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మకు డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. బుధవారం సా యంత్రం సమావేశమైన శాసనసభా పక్షం ఈ మేరకు నిర్ణయం వెలువరించిం ది. 50 ఏండ్ల రేఖ షాలిమర్ బాగ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.  

ఎవరీ రేఖా గుప్తా? 

సీఎం రేసులో కొద్ది రోజుల నుంచి రేఖా గుప్తా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్‌గా రాజకీయ జీవితం ప్రారంభించిన రేఖ అంచెలంచెలుగా ఎదిగారు. ఇప్పటికే మూడు సార్లు కౌన్సిలర్‌గా అలాగే ఓసారి సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా కూడా పని చేశారు.

మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచినా కానీ బీజేపీ మాత్రం ఆమెను ఢిల్లీ పీఠం మీద కూర్చోబెట్టింది. ఢిల్లీకి నాలుగో మహిళా సీఎంగా రేఖా గుప్తా నిలవనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఈ రోజు మధ్యాహ్నం రామ్‌లీలా మైదానంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.