18 July, 2026 | 12:34 PM

Breaking News

Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •  

మధ్యప్రదేశ్‌లో ముగ్గురు మహిళా నక్సలైట్లు హతం

20-02-2025 12:50 AM

భోపాల్, ఫిబ్రవరి 19: బాలాఘాట్ జిల్లాలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మహిళా నక్సలైట్లు మృతి చెందారని మధ్యప్రదేశ్  సీఎం మోహన్ యాదవ్ బుధవా రం ప్రకటించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసులను ఆయన అభినందించారు. 2026 నాటికి దేశం లో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చే స్తామంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. ఈ క్రమంలోనే నక్సల్స్ ఏరివేతపై తమ ప్రభుత్వం సీరియస్‌గా పని చేస్తున్నట్టు చెప్పారు. సీఆర్పీఎఫ్, కోబ్రా, డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్స్ సహా 12 బృందాలు సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నట్టు పేర్కొన్నారు.