రెండవ రోజుకు చేరిన గ్రామపంచాయతీ కార్మికుల రిలే నిరాహార దీక్షలు
నేరేడుచర్ల,(విజయక్రాంతి): గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం కొరకు నేరేడుచర్ల మండల కేంద్రంలో రెండో రోజు కూడా రిలే దీక్షలు చేయడం జరిగినదని సిఐటి మండల కన్వీనర్ నీలా.రామ్మూర్తి అన్నారు.ప్రభుత్వం వెంటనే గ్రామపంచాయతీ కార్మికులు న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని,లేని యెడల ఈనెల 24, 25,26 తేదీలలో గ్రామపంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం దిగ్బంధం చేస్తామని అన్నారు.
కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాలలో అధిక సంఖ్యలో గ్రామపంచాయతీ కార్మికుల పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు దేవరకొండ కర్ణాకర్, ఉపాధ్యక్షులు రాజు, కమిటీ సభ్యులు మధు, రాములు, శ్రీను, పిచ్చయ్య,సైదులు, వెంకటేశ్వర్లు, కాశయ్య, లక్ష్మీ, రాధ, కళ్యాణి జయమ్మ పాల్గొన్నారు






