24 February, 2026 | 8:34 PM

సమస్యలు పరిష్కరించే వరకు రిలే నిరాహార దీక్షలు

24-02-2026 01:17 AM

కొలం గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సోనే రావు

ఉట్నూర్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారుమూల అడవి ప్రాంతంలో జీవనం సాగించే కొలం గిరిజన గూడ లకు రహదారులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని, కొలం గూడల సమస్యలు పరిష్కరించే వరకు రిలే నిరాహార దీక్షలు చేపడుతామని కొలం గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొడప సోనే రావు అన్నారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయం ముందు కొలం గిరిజనుల పోరాటయోధుడు కుమ్రా సూరు చిత్రపటానికి  ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రిలే నిరాహార దీక్ష చేపట్టారు.

ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల కొలంగూడలోని గిరిజనులకు 100% ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు.. స్వతంత్రం వచ్చిన తర్వాత నుండి ఇండ్లు మంజూరు అయ్యేవరకు పూరి గుడిసెల్లో  జీవనం సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా ఇండ్లను నిర్మాణ పనులు ప్రారంభించుకుంటే అటవీ శాఖ అధికారులు గూడ లకు వచ్చి  ఇండ్ల నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గూడ లకు  ప్రభుత్వాలు రహదారులు మంజూరు చేసిన  వాటిని అడ్డుకోవడంతో పాటు ఇండ్ల నిర్మా ణం అడ్డుకుంటున్నారని  ఆరోపించారు.

టైగర్ జోన్ పేరుతో కొలం గూడ లు అభివృద్ధికి దూరంగా చెంచే ప్రయత్నాన్ని అటవీ శాఖ చేస్తుందని ఆరోపించారు. కొలం గుడ ల సమస్యలు పరిష్కారమయ్యే వరకు రిలే నిరాహార దీక్ష చేస్తామని, అవసరమైతే అమర నిరాహార దీక్ష చేస్తామని ఆయన అన్నారు. రిలే నిరాహార దీక్షలో కొలం గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు టెకం వసంతరావు, మండల శాఖ అధ్యక్షులు టెకం భీంరావు, మహిళా నాయకురాలు రాధబాయి,  ఉమ్మడి జిల్లాలోని  కొలం గిరిజన గూడల గిరిజనులు పాల్గొన్నారు.