15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పెండింగ్ బిల్లులు విడుదల చేయండి

08-02-2026 12:26 AM
  1. అప్పులు తెచ్చి అభివృద్ధి చేశాం 
  2. సర్కార్‌కు మాజీ సర్పంచ్‌ల జేఏసీ విజ్ఞప్తి 

హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి) : గ్రామాల్లో అభివృద్ధి చేసిన పనులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి మాజీ సర్పంచ్‌లు విజ్ఞప్తి చేశారు. అప్పులు తీసుకొచ్చి గ్రామాల్లో అభివృద్ధి చేశామని, ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని మాజీ సర్పంచ్‌ల జేఏసీ అధ్యక్షులు సుర్వి యాదయ్యగౌడ్, ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.

పెండింగ్ నిధులను విడుదల చేయాలని కోరుతూ మంత్రులు, అధికారులతో పాటు చివరకు సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేసినా కనికరం చూపించడం లేదన్నారు. 2019 నుంచి 2024 వరకు గ్రామాభివృద్ధికి పాటుపడ్డామ ని పేర్కొన్నారు. ప్రభుత్వం తమకు రావాల్సిన బిల్లులు విడుదల చేయకపోవడం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు.

చాలా మంది మాజీ సర్పంచ్‌లు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గ్రామాలకు ఇప్పుడు నిధులు విడుదల చేస్తున్నందున.. వాటిలోనే తమ పెండింగ్ బిల్లులను ఇచ్చే విధంగా చూడాలని సర్కార్‌ను కోరారు.