24 June, 2026 | 2:27 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

ఎండతీవ్ర నుంచి భక్తులకు ఉపశమనం

24-04-2026 12:00 AM

వెంకటాపూర్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ఎండతీవ్రత అధికమవుతున్న నేపథ్యంలోమండలంలోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామప్ప దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. ఆలయ ప్రాంగణంలో ట్యాప్స్ నుండి మెట్ల వరకు గ్రీన్ మ్యాట్లను ఏర్పాటు చేసి భక్తులకు ఉపశమనం కల్పించారు.

ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు చేపట్టగా, ఎండ వేడిని తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్న భక్తులకు ఇవి ఉపయోగకరంగా మారాయి. భక్తుల సౌకర్యం కోసం అవసరమైన మరిన్ని చర్యలు కూడా కొనసాగిస్తామని ఈవో భాస్కర్ తెలిపారు.