calender_icon.png 23 February, 2026 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత మార్కెట్ లోకి రిలీఫ్ వెల్ నెస్

23-02-2026 02:06:46 AM

హైదరాబాద్: ప్రఖ్యాత హెర్బల్ ఫార్మాస్యూటికల్ బ్రాండ్ "రిలీఫ్ వెల్ నెస్" భారతదేశ వెల్‌నెస్ మార్కెట్‌లోకి  ప్రవేశించింది. భారత్‌లో తొలిసారి స్మాల్-మాలిక్యూల్ హెర్బల్ ఫార్మాస్యూటికల్ బ్రాండ్ ను నటి కాజల్ అగర్వాల్, నటుడు మురళీమోహన్ చేతుల మీదుగా ప్రారంభించింది. ఈ బ్రాండ్  5 వేల ఆయుర్వేద జ్ఞానానికి, ఆధునిక ఫార్మాస్యూటికల్ సైన్స్‌ను అనుసంధానించే విప్లవాత్మక విధానాన్ని తీసుకువచ్చింది.

ఆధునిక పద్ధతులైన "లిపోసోమల్ మరియు నానో-డెలివరీ టెక్నాలజీ"లను ఉపయోగించడం ద్వారా, సంప్రదాయ హెర్బల్ ఎక్స్‌ట్రాక్ట్స్‌తో పోలిస్తే 20 నుండి 30 రెట్లు అధిక శోషణను సాధించినట్టు రిలీఫ్ వెల్ నెస్ తెలిపింది. దీని వల్ల క్లినికల్-గ్రేడ్ ప్రభావశీలతతో సహజ పరిష్కారాలను  అందించగలుగుతున్నట్టు వెల్లడించింది. రిలీఫ్ వెల్నెస్ అభివృద్ధి చేసిన "స్మాల్-మాలిక్యూల్ హెర్బల్ ఫార్ములేషన్"  విధానం కణ స్థాయిలో పనిచేస్తుంది. ఈ విధానంలో నిర్దిష్ట చికిత్సా సమ్మేళనాలను మాలిక్యూలర్ స్థాయిలో గుర్తించి, వేరుచేసి, వాటిని లిపోసోమల్ నానో-క్యారియర్స్‌ ద్వారా నేరుగా కణాలకు చేరేలా చేస్తుంది. దీంతో బయో అవైలబిలిటీ అధికంగా ఉంటుందని, తద్వారా చర్యలు వేగవంతంగా జరగడంతో పాటు ఆధునిక అలోపతి ఔషధాలకు సమానమైన ప్రభావశీలత సాధ్యమవుతుందనీ సంస్థ వెల్లడించింది.  

కీళ్లు మరియు ఎముకల ఆరోగ్యం, మెటాబాలిక్ వెల్‌నెస్, జ్ఞాపకశక్తి, మహిళల ఆరోగ్యం, జీర్ణక్రియ, నిద్ర, రోగనిరోధక శక్తి, ఒత్తిడి నిర్వహణ వంటి జీవనశైలి ఆరోగ్య సమస్యలకు   తమ ఉత్పత్తులు  పరిష్కారం  చూపుతాయని రిలీఫ్ వెల్ నెస్ వ్యవస్థాపకులు  డోలేంద్ర ప్రసాద్ చెప్పారు. సంస్థ CEO శ్రీ తరుణ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ప్రస్తుతం వెల్‌నెస్ విభాగం ఒక కీలక దశలో ఉందన్నారు.  భారతదేశపు ప్రాచీన ఆయుర్వేద జ్ఞానాన్ని ఆధునిక శాస్త్రీయ ఆవిష్కరణలతో ఎంతో సహజంగా కలిపిన విధానం తనకు నచ్చిందని బ్రాండ్ ప్రారంభ వేడుకకు ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ చెప్పింది.