2 September, 2026 | 4:45 AM

నైనీ బొగ్గు రాకతో ఉపశమనం!

02-09-2026 | 01:14am
  1. యాదాద్రికి చేరిన 4వేల మెట్రిక్ టన్నుల నైనీ బ్లాక్ బొగ్గు
  2. విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలోని రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాలు
  3. బొగ్గు సరఫరాపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమీక్ష

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి)రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలను విపత్కర పరిస్థితుల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు సింగరేణి సంస్థ (Singareni Company) తక్షణ చర్యలకు దిగింది. తెలంగాణలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అత్యంత కీలకమైన యాదాద్రి థర్మల్ స్టేషన్‌ను (Yadadri Thermal Station) వేధిస్తున్న బొగ్గు నాణ్యత విషయంలో సింగరేణి తీసుకున్న చర్యలతో ఒకింత ఉపశమనం లభించినట్టయింది. ఒడిశాలోని నైనీ బ్లాక్ నుంచి అత్యంత నా ణ్య మైన బొగ్గును యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌కు మంగళవారం మొట్టమొదటి రేక్ చేరు కుంది. దీంతో సాంకేతిక సమస్యలు తగ్గుతాయని తెలంగాణ జెన్‌కో భావిస్తోంది. 

విపత్కర పరిస్థితుల్లో రెండు ప్లాంట్లు..

బొగ్గు కొరత కారణంగా రాష్ట్రంలోని రెండు థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో విపత్కర పరిస్థితులు తలెత్తాయి. భద్రాద్రి ప్లాంట్ (1080 మెగావాట్లు)లో సుమారు 3.39 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండాలి. కానీ ఆగస్టు 31 నాటికి కేవలం 77.3 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు మాత్రమే నిల్వ ఉంది.

ఉండాల్సిన బొగ్గు ని ల్వల్లో కేవలం 23 శాతం మాత్రమే ఉండటంతో దీనిని కేంద్రంలోని సెంట్రల్ ఎలక్ట్రీసి టీ అథారిటీ (సీఈఏ) క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నట్టుగా పేర్కొంది. అలాగే యాదాద్రి థ ర్మల్ స్టేషన్ (3200 మెగావాట్లు)లో సుమా రు 9.18 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ లు ఉండాలి. కానీ ఆగస్టు 31 నాటికి కేవలం 1.23 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది.  ఈ నేపథ్యంలో వైటీపీఎస్‌లో కూడా క్రిటికల్ పరిస్థితిల్లో కేవలం 43 శాతం పీఎల్‌ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్)తోనే నడిపిస్తున్నారు.

బొగ్గు నాణ్యతపై వివాదం

ఇదిలా ఉండగా.. సింగరేణి బొగ్గు నాణ్యతపై మొదటి నుంచి థర్మల్ విద్యుత్తు కేంద్రా లు ఫిర్యాదు చేస్తూనే ఉన్నాయి. తక్కువ నాణ్యత గల బొగ్గుతో థర్మల్ కేంద్రాల్లో సాంకేతిక ఇబ్బందులు, బాయిలర్‌లో సమస్యలు తలెత్తుతున్నాయని ఫిర్యాదులు ఉన్నా యి.

ఈ సమస్యలతోనే యాదాద్రి థర్మల్ కేంద్రాన్ని పూర్తిస్థాయి పీఎల్‌ఎఫ్‌తో నడిపించలేకపోతున్నామని తెలంగాణ జెన్‌కో ఇంజనీర్లు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినట్టు సమాచారం. ఇక ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి నాణ్యమైన బొగ్గు సరఫరాకు పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది.

1050 కి.మీ దూరం నుంచి..

యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రానికి సింగరేణి ఆధ్వర్యంలోని ఒడిశాలో గల నైనీ బ్లాక్ నుంచి నాణ్యమైన బొగ్గుతో మొట్టమొదటి రైల్ రేక్ (4వేల టన్నులు) మంగళవా రం చేరుకుంది. సుమారు 1050 కి.మీ దూరం ప్రయాణం చేసి నైనీ బొగ్గు వైటీపీఎస్‌ను చేరింది. ఈ  థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సమస్యలు తగ్గనున్నాయి.   

థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు తగినంత బొగ్గు : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

దేశంలో విద్యుత్తు వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ బొగ్గు ఉత్పత్తి సంస్థలు తమతో ఇంధన సరఫరా ఒప్పందం ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తగినంత బొగ్గు సరఫరా చేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆదేశించారు.

మంగళవారం ఢిల్లీ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బొగ్గు ఉత్పత్తి సంస్థలతో పరిస్థితిని సమీక్షించారు. దేశంలో మొత్తం 28 థర్మల్ కేంద్రాల వద్ద బొగ్గు నిల్వలు తక్కువగా ఉన్నాయని, దీనిపై బొగ్గు సంస్థలు తక్షణం స్పందించి సరఫరా పెంచాలని ఆదేశించారు.