మంచు కొండలను తలపిస్తున్న రెల్లుగడ్డి
09-09-2026 | 05:05am
అశ్వాపురం, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): సీతారామ ప్రాజెక్టు(Sitarama Project) పనుల కోసం తీసిన మట్టి గుట్టలపై విరివిగా పెరిగిన తెల్లటి రెల్లుగడ్డి(White Rellu grass) మంచు కొండలను(Snow-capped mountains) తలపిస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది. వర్షాకాలం(Monsoon season)లో మట్టి గుట్టలపై దట్టంగా పెరిగిన రెల్లుగడ్డి తెల్లటి పుష్పాలతో కప్పుకుపోవడంతో దూరం నుంచి మంచుతో కప్పబడిన కొండల మాదిరిగా కనిపిస్తోంది. గాలి వీచినప్పుడల్లా తెల్లటి పుష్పగుచ్ఛాలు అలల మాదిరిగా ఊగుతూ ప్రకృతి సోయగాలను పంచుతున్నాయి. సీతారామ ప్రాజెక్టు(Sitarama Project) పనుల కోసం ఏర్పడిన మట్టి గుట్టలకు ప్రకృతి(Nature) సహజంగా సరికొత్త అందాన్ని అద్దడంతో అటుగా వెళ్లే వాహనదారులు, స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.