3 April, 2026 | 3:15 AM

హనుమను గుర్తుచేసేలా..

03-04-2026 12:00 AM

రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ప్రేక్షకుల్లో రోజురోజుకు అంచనాలను పెంచుతోంది. తాజాగా హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మేకర్స్ ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రామ్‌చరణ్ తన కెరీర్‌లోనే మోస్ట్ ఇంటెన్స్, ఆధ్యాత్మి కతతో కూడిన అవతార్‌లో కనిపిస్తున్నారు. చేతిలో గధ పట్టుకొని, ఒక పల్లెటూరి అఖాడా (వ్యాయామశాల) మధ్యలో నిలబడి వున్న చరణ్.. హనుమను గుర్తుచేస్తున్న లుక్ అందరినీ కట్టిపడేసేలా ఉంది.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సిని మాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిన్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూర్చుతుండగా, ఆర్ రత్నవేలు డీవోపీగా, నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది.