3 April, 2026 | 3:09 AM

కన్‌ఫర్మ్ చేసిన మండోదరి!

03-04-2026 12:00 AM

పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవల ‘భగవంత్ కేసరి’, ‘కన్నప్ప’ వంటి చిత్రాల్లో మెరిసింది. ఈ టాలీవుడ్ చందమామ ఇప్పుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’లో అలరించబోతోంది. ఈ విషయాన్ని కాజల్ స్వయంగా ప్రకటించింది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పౌరాణిక గాథలో కాజల్ కీలక పాత్ర పోషిస్తోంది. కొద్దికాలంగా ఈ సినిమాలో కాజల్ రావణాసురుడి భా ర్య మండోదరి పాత్రలో కనిపించనుందని వార్తలు వచ్చాయి.

తాజాగా ఆమె తన ఇన్‌స్టా పోస్ట్ ద్వారా అధికారికంగా ఈ వార్తలను నిజం చేసినట్టయ్యింది. రామాయణ గ్లింప్స్ షేర్ చేస్తూ.. ‘ప్రతి తరం శ్రీరాముడి పేరుతోనే పెరిగారు. ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తం మర్యాదా పురుషోత్తముడైన ఆ రాముడిని దర్శించుకోబోతోంది. ఇలాంటి ఒక గొప్ప దృశ్యకావ్యంలో నేను కూడా భాగమైనందుకు చాలా గర్వపడుతున్నాను” అని భావోద్వేగభరితమైన నోట్ రాసుకొచ్చింది. చందమామ కాజల్ ఈ క్రేజీ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.