రామ దర్శనం!
బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ‘రామాయణం’. దర్శకుడు నితీశ్ తివారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రూపుదిద్దుకుంటోంది. ఇందులో రణబీర్ కపూర్ రాముడి పాత్రను పోషిస్తుండగా.. సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు.
సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా ఈ సినిమా నుంచి రణబీర్ కపూర్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘రామ’ పేరుతో విడుదలైన ఈ వీడియోలో రణబీర్ కపూర్ రాముడిగా ఎంతో గంభీరంగా, శాంత స్వభావంతో కనిపిస్తూ, ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా మొదటి భాగాన్ని 2026 దీపావళి సందర్భంగా విడుదల కానుంది.




