విశాఖ ఉక్కు ఆస్తులపై స్టేటస్‌కో తొలగించండి
హైకోర్టును కోరిన విశాఖ ఉక్కు యాజమాన్యం
విజయవాడ, జూన్ 25 (విజయక్రాంతి): విశాఖ ఉక్కు పరిశ్రమ భూములు, ఆస్తుల అమ్మకాల విషయంలో స్టేటస్‌కో కొనసాగించాలన్న గత ఉత్తర్వులను సవరించాలని ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది. విశాఖ ఉక్కు ఆస్తుల విక్రయం విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసా గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని గతంలో హైకో ర్టు ఆదేశించింది. దీనిని సవరించాలని విశా ఖ ఉక్కు యాజమాన్యం (ఆర్‌ఎఐఎన్‌ఎల్) మంగళవారం హైకోర్టును కోరింది.
ఆర్‌ఎన్‌ఎల్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై కౌంటర్లు దాఖలు చేయాలని పిటిషనర్లను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ జగడం సుమతిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిమిత్తం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఐపీఎస్ మాజీ అధికారి జేడీ లక్ష్మీనారాయణ, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, సువర్ణరాజు విడివిడిగా పిల్స్ వేశారు. వీటి విచారణ వచ్చే నెల 2కి వాయిదా పడింది.






