14 July, 2026 | 11:12 PM

జైలు నుంచి వికీలీక్స్ అసాంజే విడుదల

26-06-2024 12:12 AM
  1. నేరాన్ని అంగీకరించిన వికీలీక్స్ ఫౌండర్
  2. అమెరికాతో కుదిరిన ఒప్పందం

న్యూయార్క్, జూన్ 25 : గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే (52) మంగళవారం ఉదయం లండన్ జైలు నుంచి విడుదలయ్యారు. అమెరికా న్యాయశాఖతో జరిగిన ఒప్పందంలో భాగంగా నేరాన్ని అంగీకరించడంతో ఆయనకు జైలు జీవితం నుంచి విముక్తి లభించనుంది. ఈ పరిణామంతో రహస్య పత్రాల ప్రచురణ కేసు ముగింపునకు చేరుకుంది. అసాంజేపై అమెరికా అనేక ఆరోపణలు చేస్తూ వస్తోంది. అయితే, ఆరోపణలన్నీ నిజమేనని అసాంజే ఒప్పుకున్నారు. గూఢచర్యం చట్టానికి విరుద్ధంగా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందడం, వ్యాప్తి చేయడం వంటి నేరారోపణలను ఆయన అంగీకరించారు.

అయితే, దీన్ని న్యాయమూర్తి తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంది. ఒకవేళ అదే జరిగితే, అమెరికా ఇన్నాళ్లు చేస్తున్న ఆరోపణలు నిజమవుతాయి.  అయితే, కోర్టు విచారణలో భాగంగా ఆయన అమెరికాకు రావడానికి నిరాకరించారు. అందువల్లే, ఆస్ట్రేలియా మరియానా ఐలాండ్స్‌లోని సైపన్ కోర్టులో బుధవారం విచారణకు ఏర్పాట్లు చేశారు. అమెరికా ఆధీనంలో ఉండే మరియానా ఐలాండ్స్ ఆస్ట్రేలియాకు సమీపంలో ఉంటుంది. అమెరికాతో జరిగిన ఒప్పందంలో భాగంగా అసాంజే నేరాన్ని అంగీకరించడంతో అదనపు జైలు శిక్ష నుంచి ఆయనకు విముక్తి లభించనుంది.