30 July, 2026 | 7:04 AM

కాళేశ్వరం దర్శన వేళల పునరుద్ధరణ

19-06-2024 12:10 AM

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 18(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శన వేళలు పునరుద్ధరించినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ, వాతావరణంలో ఏర్పడుతున్న మార్పుల దృష్ట్యా స్వామి వారి దర్శన వేళల్లో మార్పులు చేసినట్టు పేర్కొన్నారు. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకు భక్తులు స్వామివారికి పూజలు చేసుకోవచ్చని చెప్పారు. బుధవారం నుంచే  అమలులోకి రానున్నట్టు స్పష్టంచేశారు.