22 May, 2026 | 11:35 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

సింగరేణి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించండి

19-06-2024 12:05 AM

డిప్యూటీ సీఎం భట్టికి, మంత్రి శ్రీధర్‌బాబుకు విన్నపం

మంథని, జూన్18 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్‌కు చెందిన సింగరేణి నిర్వాసితులు తమ సమస్యలను పరిష్కరించాలని సోమవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రగతిభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, రాష్ట్ర ఐటీ, భారీ పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కలిసి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. సింగరేణి అధికారులు తమను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.

ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అర్హులందరికీ వచ్చే విధంగా చూడాలని కోరారు. మంత్రులు వెంటనే స్పందించి సమస్యలను సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో మాజీ ఎంపీటీసీ వనం రాంచందర్‌రావు, మాజీ సర్పంచ్ బీవీ స్వామిగౌడ్, నాయకులు బర్ల శ్రీనివాస్, తొగరి లింగయ్య, వీరగోని లక్ష్మణ్, పొన్నం సత్యనారాయణ గౌడ్, , మెడగొని రాంయందర్, శ్రీనివాస్ ఉన్నారు.