29 July, 2026 | 1:31 AM

ఘనంగా రేణుక ఎల్లమ్మ ద్వితీయ వార్షికోత్సవం

29-07-2026 12:38 AM

కడ్తాల్, జూలై 28(విజయక్రాంతి): మండల పరిధిలోని ఎక్వాయిపల్లి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాలు రెండు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు పుట్టమన్ను సేకరణతో కార్యక్రమాలు ప్రారంభించగా, రెండవ రోజు ఉదయం అమ్మవారికి మైలపోలు మరియు కళ్యాణ మహోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు.

ఈ కళ్యాణ మహోత్సవానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ దేవతల కళ్యాణాలు, బోనాల ఉత్సవాలు మన తెలంగాణ సంస్కృతి, జీవన విధానంలో అంతర్భాగమని పేర్కొన్నారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, గ్రామాలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎక్వాయిపల్లి సర్పంచ్ పాలకూర్ల కరుణాకర్ గౌడ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్ల రవికాంత్ గౌడ్, టిపిసిసి సభ్యులు ఆయిల శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నరసింహ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్, పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్, డైరెక్టర్ జోగు వీరయ్య, డిసిసి ఉపాధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు పుట్టి లక్ష్మీ యాదయ్య, సుమన్, మధు, జంగయ్య, యాదయ్య గౌడ్, వంశీ, మహేష్, లక్ష్మణ్, రమేష్ నాయక్, జంగం రాజు, కట్ట సురేష్ తదితరులు పాల్గొన్నారు.