27 July, 2026 | 4:57 PM

రోడ్డు విస్తరణకు ప్రజావాణిలో వినతి

27-07-2026 04:17 PM

బిక్కనూర్, జూలై 27(విజయక్రాంతి): బిక్కనూర్ మండలం కంచర్ల గ్రామ పాలకవర్గం జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించింది. పెద్దమల్లారెడ్డి గ్రామంలోని గాంధీ చౌరస్తా నుంచి ఎస్సీ కాలనీ వరకు ఉన్న సింగిల్ రోడ్డును విస్తరించాలని కోరారు. ఈ రహదారిపై రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తే సుమారు 600 మీటర్ల నుంచి కిలోమీటర్ వరకు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని వివరించారు. సమస్యపై స్పందించిన జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను క్షేత్రస్థాయికి పంపించి పరిశీలించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంచర్ల సర్పంచ్ గొల్ల అరుణ స్వామి యాదవ్, ఉపసర్పంచ్ ఆస రమేష్, వార్డు సభ్యుడు మట్టి రజనీకాంత్ రెడ్డి, లక్ష్మి, ప్రవీణ్, కర్రోళ్ల సిద్ధరాములు, చిన్నోళ్ల సుజాత, రవి తదితరులు పాల్గొన్నారు.