1 July, 2026 | 5:22 PM

తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బోధన్ ఆర్టీవోకు వినతి పత్రం

01-07-2026 04:13 PM

బోధన్,(విజయక్రాంతి): తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాలే నాగేష్ మాట్లాడుతూ... బోధన్ పట్టణంలోని యూనిక్ హైస్కూల్ ప్రైవేట్ స్కూల్ బస్సు AP20TB6907, బండారుపల్లి నుంచి శ్రీనివాస్ క్యాంప్ మార్గమధ్యలో ఈ సంఘటన జరిగింది, బస్సు స్ట్రింగ్ హ్యాండిల్ రాడ్డు విరిగిపోయి బస్సు అదుపు తప్పింది. రోడ్డు పక్కనే చెట్టు ఉండటం వలన బస్సు ఆగింది. లేకుంటే పిల్లల ప్రాణాలకు ప్రమాదం అయిఉండేది కావున వెంటనే ఫిట్నెస్ లేని ప్రవేట్ స్కూల్ బస్సులను వెంటనే సీజ్ చేయాలన్నారు. అలాగే ప్రైవేట్ స్కూల్స్ బస్సు నడిపే డ్రైవర్లకు లైసెన్స్ కచ్చితంగా ఉండాలి. లేనియెడల స్కూల్ పైన చర్యలు తీసుకోవాలని అలాగే ఫిట్నెస్ లేని బస్సులను వెంటనే చర్యలు తీసుకోవాలి అలాగే ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా, విద్యార్థుల ప్రాణాల భద్రత గురించి ఆలోచించి వెంటనే ప్రవేట్ స్కూల్ బస్సు ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.