తాగునీటి సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే మల్లారెడ్డికి వినతి
25-04-2026 04:51 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ డివిజన్ ప్రాంతంలో నెలకొన్న తీవ్ర తాగునీటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆపార్టీ నాయకులు మేడ్చల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. డివిజన్ పరిధిలో తాగునీటి సమస్య విపరీతంగా ఉందని, వీధి దీపాలు వెలుగక రాత్రులు అంధకారంలో ప్రజలు ఉంటున్నారని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు తెలియజేశారు. అదేవిధంగా ఘట్ కేసర్ బాలాజీనగర్, కొండాపూర్ రోడ్డు నుండి ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు వరకు కరీంగూడ రోడ్డును మరమ్మతు చేయించాలని కోరారు.






