12 August, 2026 | 9:05 PM

పిఆర్సి కోసమై దశలవారి పోరాటం

12-08-2026 07:29 PM

ఎమ్మార్వోకు వినతి పత్రం

దేవరకద్ర: పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని 2023 జూలై నుంచి అమలు చేయాలని టీఎస్ యుటిఎఫ్ దేవరకద్ర మండల అధ్యక్షుడు కె.శంకర్, డీటీఎఫ్ ఉపాధ్యక్షురాలు సృజన సంయుక్తంగా తెలియజేశారు. పెండింగ్ లో ఉన్న 6 డీఎలను వెంటనే ప్రకటించాలని, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ మినిమం టైమ్స్ స్కేల్ అమలు చేయాలని, సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి వోపిఎస్ ను పునరుద్ధరించాలి.

ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో బుధవారం దేవరకద్ర మండల తహసిల్దార్ అర్షద్ కి వినతి ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈనెల 19న జిల్లా కేంద్రంలో 29న హైదరాబాద్ లో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు. కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ దేవరకద్ర మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కె శంకర్, డి కృష్ణయ్య, జిల్లా కార్యదర్శులు ఎం వేణుగోపాల్, డి.అజయ్ , అర్చన, రవీంద్రప్ప , జగదీష్, మల్లికార్జున్, రషీద్, డి టి ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సృజన, అపర్ణ,సురేఖ మరియు యు ఎస్ పి ఎస్ సభ్యులు ,  ఉపాధ్యా యులు  రాజశేఖర్, రాజశేఖర్ రెడ్డి, పౌలు, కవిత, పరమేశ్వర కొండారెడ్డి, యుషుబ్ తదితరులు పాల్గొన్నారు.