29 July, 2026 | 1:14 AM

భూ వివాదంపై తహసీల్దార్‌కు వినతి

29-07-2026 12:10 AM

అలంపూర్, జూలై 28: వడ్డేపల్లి మండలం కొంకల గ్రామంలోని సర్వే నెం.54లో ఉన్న 5 ఎకరాల 19 గుంటల భూమికి సంబంధించిన వివాదాన్ని నిబంధనల ప్రకారం పరిష్కరించాలని కోరుతూ మాజీ జడ్పీటీసీ వడ్డేపల్లి శ్రీనివాసులు, మాజీ వైస్ ఎంపీపీ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ శివకుమార్కు వినతిపత్రం అందజేశారు.

బత్తాల శంకర్ గౌడ్, బత్తాల దేవేంద్ర గౌడ్ సోదరుల మధ్య నెలకొన్న భూ వివాదంపై న్యాయం చేయాలని కోరారు. దీనిపై తహసీల్దార్ స్పందిస్తూ విషయం పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంజుల ధర్మ, కౌన్సిలర్ విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.