8 April, 2026 | 5:32 PM

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్

08-04-2026 03:54 PM

హైదరాబాద్: జూబ్లీ హిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) రిపబ్లిక్ ఆఫ్ ఘన(Ghana) హైకమిషనర్ క్వాసి ఒబిరి-డాన్సో (Kwasi Obiri- Danso) మర్యాదపూర్వకంగా కలిశారు. హైకమిషనర్ క్వాసి ఒబిరి-డాన్సో  హైకమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన Hyderabad కు రావడం ఇదే మొదటిసారి.

సమావేశం సందర్భంగా పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడం, స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించడంపై చర్చలు జరిగాయి. ముఖ్యంగా విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఆరోగ్య సంరక్షణ, వాణిజ్య రంగాలలో Ghana,  Telangana మధ్య సంబంధాలను మరింత పెంపొందించడం పట్ల హైకమిషనర్ తన ఆసక్తిని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సానుకూలంగా స్పందించి, ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి తమ మద్దతు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.