21 August, 2026 | 6:06 PM

నిధుల కోసం మంత్రులకు వినతి

21-08-2026 05:20 PM

నిర్మల్, ఆగస్ట్ 21 ( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా లక్ష్మణ చందా మండలం రాచ పూర్ బీసీ గురుకుల పాఠశాల భవనానికి నిధులు మంజూరు చేయాలని నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ హరి రావు, మండల పార్టీ అధ్యక్షుడు కొమ్ము నరేష్ రెడ్డి.. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి వినతిపత్రం అందించారు. ప్రస్తుతం భవనం కొరత కారణంగా బీసీ గురుకుల పాఠశాల మామడ మండల కేంద్రంలో నిర్వహిస్తున్నారు. అనంతరం కార్మిక శాఖ మంత్రి వెంకటస్వామిని కలిసి నిర్మల్ లో కార్మిక భవన్ తో పాటు, ఉపాధి కల్పన కేంద్రాలు ఏర్పాటు చేయాలని విన్నవించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.