కనుగుట్ట శబరి మాత ఆశ్రమంలో తెలుగు భజన బృందం
21-08-2026 05:33 PM
బోథ్. ఆగస్టు 21 (విజయ క్రాంతి): మండలంలోని కనుగుట్ట గ్రామంలో కొనసాగుతున్న శబరిమాత అఖండ జ్యోతి కార్యక్రమానికి శుక్రవారం ఆదిలాబాద్ తెలుగు భజన బృందం వారు రావడం జరిగింది. వారు ఆలపించిన భక్తి గీతాలు భక్తుల నాకట్టుకున్నాయి. ఉదయం నుండి సాయంత్రం మూడు గంటల వరకు నిర్విరామంగా భక్తి గీతాలు ఆలపించారు. భజన బృందం వారిని కనుగుట్ట శబరిమాత ఆశ్రమ కమిటీ వారు ఘనంగా సన్మానించారు.






