రూపారెడ్డి హత్యను ఖండిస్తూ మంచిర్యాలలో భారీ ర్యాలీ
ఉపాధ్యాయుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి
మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి) : నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రధానోపాధ్యాయురాలు రూపారెడ్డి దారుణ హత్య ఘటనను నిరసిస్తూ శుక్రవారం తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం (TRSMA) మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావుకి TRSMA జిల్లా సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాపోలు విష్ణువర్ధన్ రావు మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయులపై దాడులు ఆందోళనకరంగా పెరిగిపోతున్నాయని, క్రమశిక్షణలో భాగంగా గురువు మందలిస్తేనే తల్లిదండ్రులు పాఠశాలలకు వచ్చి గొడవకు దిగుతున్నారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయ రక్షణ చట్టం' (Teachers Protection Act) తీసుకురావాలని, ప్రతి పాఠశాలను Drug-Free School Zoneగా ప్రకటించి, పాఠశాలల పరిసరాల్లో జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో పాఠశాలలు వెంటనే సంప్రదించేందుకు ప్రత్యేక (Emergency Response System)ను ఏర్పాటు చేసి, పాఠశాల వేళల్లో క్రమం తప్పకుండా పోలీసు పెట్రోలింగ్ నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు దామెర్ల సిద్దయ్య, జిల్లా కోశాధికారి ఉదారి చంద్రమోహన్ గౌడ్, రాష్ట్ర నాయకులు కస్తూరి పద్మ చరణ్, యార్లగడ్డ బాలాజీ, రాం వేణు, అఖిలేందర్ సింగ్, కె ప్రవీణ్ కుమార్, గోపతి సత్తయ్య, జిల్లా నాయకులు ఉస్మాన్ పాషా, పోలు శ్రీనివాస్, మద్దెర్ల శ్రీనివాస్, పెంచాల శ్రీధర్, మంచిర్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి సాధిక్ భాష, పట్టణ కోశాధికారి మోహన్ వర్మ, విక్రం రావు, హాయ్ మధు ఖాన్, జాన్ థామస్, బిజ్జు కురివిళ్ళ, జహీరా ఖాతున్, బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు రాజలింగు, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, కోశాధికారి శేషు, మందమర్రి మండల అధ్యక్షుడు పెద్దపల్లి ఉప్పలయ్య, వై కరుణాకర్ రెడ్డి, కృష్ణమోహన్, వివిధ మండలాల పాఠశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్ లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.






