21 August, 2026 | 6:44 PM

అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు

21-08-2026 05:40 PM

ఉట్నూర్, ఆగస్టు 21 ( విజయక్రాంతి ): ఉట్నూర్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో ప్రజలు, యువత అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే  ఉపేక్షించేది లేదని ఉట్నూర్ పోలీస్ సబ్ డివిజన్ ఏ ఎస్ పి  రిత్విక్ సాయి కొట్టే  అన్నారు. శుక్రవారం ఉట్నూర్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని  వివిధ పోలీస్ స్టేషన్లో పరిధిలోని గ్రామాల్లో కార్డన్ సెర్చ్  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఉట్నూర్ సబ్ డివిజన్ పరిధిలోని ఇండ్రవెల్లి, నార్నూర్, గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో శుక్రవారం ఉదయం 05.00 గంటల నుంచి 09.00 గంటల వరకు ప్రత్యేక వాహన తనిఖీలు మరియు గ్రామాల్లో కార్డన్ అండ్ సెర్చ్ (Cordon & Search) ఆపరేషన్లు నిర్వహించడం జరిగిందన్నారు. ఆయా పోలీస్ స్టేషన్లో పరిధిలో నిర్వహించిన కాటన్ సెర్చ్  వివరాలను వెల్లడించారు.


ఈ సందర్భంగా  కార్టూన్ సెర్చ్ నిర్వహించిన గ్రామాల్లో ఏ ఎస్పీ  రిత్విక్ సాయి కొట్టే  పర్యటించి ప్రజల ఉద్దేశించి  మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా తమ వాహనాలకు సక్రమమైన నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకుని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడపడం, అక్రమ కార్యకలాపాలకు పాల్పడడం వంటి ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే అక్రమంగా గుడుంబా తయారీ, విక్రయాలు మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.