18 May, 2026 | 1:26 AM

క్రికెట్ గౌండ్ కాపాడాలని ఎమ్మెల్యేకు వినతి

18-05-2026 12:25 AM

మేడ్చల్ అర్బన్, మే 17 (విజయ క్రాంతి): పూడూర్‌కిష్టాపూర్ డివిజన్ పరిధి పూడూర్ గ్రామంలోని క్రీడా ప్రాంగణాన్ని కాపాడాలంటూ క్రీడాకారులు,యువకులు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి వినతిపత్రం అందజేశారు. పూడూర్ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను కలిసి గ్రామ పరిధిలోని 608 సర్వే నెంబర్లో గత ప్రభుత్వం క్రీడా ప్రాంగణం ఏర్పాటు  చేసిందన్నారు. క్రీడాకారుల ఆటల కోసం కేటాయించిన స్థలాన్ని ఇతరులకు ఇవ్వకుండా క్రీడలకు కేటాయించాలని కోరారు. క్రీడా మైదానం ఉంటేనే యువకులు క్రీడలపై ఆసక్తితో ముందుకు సాగుతారని తెలిపారు. కార్యక్రమంలో లక్ష్మణ్యాదవ్, ప్రవీణ్, ప్రశాంత్, నిఖిల్, పరమేశ్, శ్రీనివాస్, శివ, సాయి, ప్రతాప్, మధు, దినేశ్ పాల్గొన్నారు.