21 July, 2026 | 7:33 PM

Breaking News

రేపు సామూహిక గాయత్రి మంత్ర జప యజ్ఞం   •   జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి   •   అమ్మ నగర్ బ్రిడ్జితో దూరభారం తగ్గుతుంది   •   నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలి   •   జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యం   •   సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విస్తృత అవగాహన   •   సుల్తానాబాద్ మున్సిపాలిటీ 17 బూతుల బిఎల్ఎ 2 ల సమావేశం   •   ఫోటో, వీడియో గ్రాఫర్ల కు అండగా ఉంటాం: మేయర్ కొలగాని   •   ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి   •   సర్పంచ్ పగడాల రమాదేవి అధ్వర్యంలో తడి–పొడి చెత్త బుట్టల పంపిణీ   •  

సూదిని రాంరెడ్డి అభినందన సభను విజయవంతం చేయండి

18-05-2026 12:26 AM

ఆమనగల్లు, మే 17(విజయక్రాంతి): టీజీపీ ట్రిబ్యునల్ చైర్మన్గా నియమితులైన మాడ్గుల మాజీ ఎంపీపీ సూదిని రాంరెడ్డి అభినందన సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కల్వకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు పిలుపునిచ్చారు. ఆదివారం ఆమనగల్ పట్టణంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో కల్వకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్య సమావేశం అమనగల్లు మండల అధ్యక్షుడు తెలుగమల జగన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

సమావేశంలో ఇటీవల టీజీపీ ట్రిబ్యునల్  చైర్మన్ రాంరెడ్డి  ఎన్నిక కావడంతో ఆయనకు నియోజకవర్గం తరపున సన్మాన, అభినందన సభ ఈ నెల 20వ తేదీ  ఆమనగల్లులోని శ్రీ లక్ష్మీ గార్డెన్లో నిర్వహించేందుకు రాజకీయాలకతీతంగా,నియోజకవర్గ ప్రజలు, వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ బట్టు కిషన్ రెడ్డి,సింగిల్ విండో మాజీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు గౌడ్, యాట నర్సింహా, శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్యూఐ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.