19-02-2026 01:57:23 AM
అలంపూర్, ఫిబ్రవరి 18: మానవపాడు శివారులో ఉన్న పాత రైల్వే స్టేషన్ ను తొలగించి ప్రధాన రహదారి వద్ద ఉన్న రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి వద్ద రైల్వే హాల్టును ఏర్పాటు చేస్తే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యంతో పాటు ప్రయోజనకరంగా ఉంటుందని రైతు సంఘం సభ్యులు బిజెపి నాయకులు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు విన్నవించారు.ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లోని ఎంపీ నివాసంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసివినతి పత్రాన్ని అందజేశారు.
మానవపాడు మండల కేంద్రంతోపాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అందువల్ల ప్రధాన రహదారి వద్ద రైల్వే హాల్టును ఏర్పాటు చేసేందుకు చొరవ తీసుకోవాలని ఎంపీకి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎంపీ సానుకూలంగా స్పందిస్తూ.. ప్రయాణికుల సౌకర్యం రైల్వే హాల్ట్ ఏర్పాటు విషయమై జీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కారిస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు పేర్కొన్నారు. ఎంపీని కలిసిన వారిలో రైతు సంఘం నాయకులు కిషోర్, బోయ బాబు, నాగశేషి, బజారి, బిజెపి మండల అధ్యక్షులు మురళీకృష్ణ, రాఘవయ్య, తదితరులు ఉన్నారు