calender_icon.png 19 February, 2026 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇబ్రహీంపట్నం చైర్మన్ ఎన్నికకు లైన్‌క్లియర్

19-02-2026 01:56:35 AM

స్టే ఎత్తివేసిన హైకోర్టు.. తుదినిర్ణయం ఆర్వో, కలెక్టర్‌కు జారీ

19వ వార్డు కౌన్సిలర్‌పై ఒత్తిడి తేవద్దని ఆదేశాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): వాయిదా పడుతూ వస్తున్న ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. చైర్మన్ ఎన్నికపై విధించిన స్టేను హైకోర్టు బుధవారం ఎత్తివేసింది. దీంతో చైర్మన్ ఎన్నికకు మార్గం సుగమం అయింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి జిల్లా కలెక్టర్, ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకోవాల ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇబ్రహీంపట్నంలో గెలిచిన ఓ కౌన్సిలర్ కనిపించకుండా పోవడం తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 19 వార్డు కౌన్సిలర్‌గా విజయం సాధించిన ఆకుల యాదగిరిపై ఎటువంటి ఒత్తిడి కూడా తీసుకురావద్దని జిల్లా కలెక్టర్, పోలీసులను హైకోర్టు ఆదేశించింది. యాదగిరి కన్పించడం లేదంటూ ఆయన కుమారుడు హరికాంత్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై బుధారం హైకోర్టు విచారణ జరిపింది. యాదగిరి స్వచ్ఛందంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.