calender_icon.png 19 May, 2025 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ బెడ్‌రూం సమస్యల పరిష్కారానికి ఎంపీకి వినతి

19-05-2025 12:00:00 AM

మేడ్చల్, మే 18(విజయ క్రాంతి): బాచుపల్లి డబుల్బెడ్ రూం సముదాయంలో సమస్యల పరిష్కానికి కృషి చేయాలని ఎంపీ ఈటల రాజేందర్ను ఆదివారం మేడ్చల్ మున్సిపాలిటీ పూడూరులోని తన నివాస గృహంలో నివాసితులు కలిసి, వినతి పత్రం సమర్పించారు. బాచుపల్లిలో 10 బ్లాకుల్లో 1080 కుటుంబాలు ఉన్నాయన్నారు.   నీటి సరఫరా సౌకర్యం, బోరు లేని కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నామన్నారు.

ప్రహరీ లేని కారణంగా పాములు, విష పురుగుల నుంచి రక్షణ లేకుండా పోయిందన్నారు. శ్మశాన వాటిక లేదని, వేలాది మంది అక్కడి నివాసిస్తున్నా వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని ఆవేదన వ్యక్త చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడికి తీసుకువచ్చి, డబుల్ బెడ్ రూం ఇండ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు కోరారు.

భూ సేకరణలో తక్కువ నష్ట పరిహారం

నాగ్ పూర్ - అమరావతి గ్రీన్ ఫీల్ హైవే నిర్మాణం కోసం చేస్తున్న భూసేకరణలో నిర్వాసితులకు ఇస్తున్న నష్టపరిహారం చాలా తక్కువ ఉందని వరంగల్ జిల్లా రైతులు ఎంపీ ఈటల రాజేందర్ను కలిసి వినతి ప త్రం సమర్పించారు. వాస్తవ విలువలో ఇర వై శాతం కూడా పరిహారం ఇవ్వడంలేదని, వాస్తవ ధరల ప్రకారం పరిహారం ఇస్తేనే భూ మి ఇస్తామన్నారు.  ఈ విషయాన్ని ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి, న్యాయం చేయాలని కోరారు.