24 July, 2026 | 7:01 PM

వన భోజనాల కోసం వసతులు కల్పించాలని వినతి

24-07-2026 06:23 PM

ఆర్మూర్,(విజయక్రాంతి): ఆషాడ మాసంలో వన భోజనాలకు వెళ్లే ప్రజల కోసం పోచమ్మ మందిరం వద్ద వసతులు కల్పించాలని బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పార్టీ  కౌన్సిలర్లతో కలిసి శుక్రవారం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు. బిజెపి పట్టణ శాఖ అధ్యక్షుడు మందుల బాలు, కౌన్సిలర్లు మాట్లాడుతూ ఆషాడ మాసంలో ప్రజలు పోచమ్మ దేవాలయాలకు వనభోజనాలకు వెళ్తారని, వారి కోసం వసతులు కల్పించాలని కోరారు.

ముఖ్యంగా రోడ్లపై మొరం వేయడం, మంచినీటి సౌకర్యం కల్పించడం, టెంట్ సామాగ్రి వసతి కల్పించడం, పిచ్చి మొక్కలు ఉంటే వాటిని తొలగించడం ట్రాక్టర్ తో చదను చేయించడం వంటి కార్యక్రమాలు వెంటనే తక్షణమే చేయాలని కోరారు. హిందూ పండగలకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో  కౌన్సిలర్లు యామాద్రి కవితా భాస్కర్, శ్రావణ్ గౌడ్, బొట్టు రాజు, ఖాందేశ్ ప్రశాంత్, పోచంపాడు శీను, పాన్ శీను, దొండి ఈశ్వర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.