విద్యుత్ వినియోగంలో భద్రత నియమాలు పాటించాలి
24-07-2026 06:27 PM
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్తు శాఖ ఎస్ ఈ రమేష్ తెలిపారు. శుక్రవారం భూపాలపల్లి సర్కిల్ పరిధిలోని రేగొండ సెక్షన్‌లోని నిజాంపల్లి గ్రామంలో విద్యుత్ భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఈ రమేష్ గ్రామస్థులకు విద్యుత్ లైన్లకు సమీపంలో అప్రమత్తంగా ఉండాలని, అనధికారిక కనెక్షన్లు తీసుకోవద్దని, ఎలాంటి లోపాలు గమనించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.ఈ సందర్భంగా ప్రజలు విద్యుత్తు సమస్యలను ఎస్ఈ దృష్టికి తీసుకురాగా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.






