కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి
ఘట్ కేసర్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్ పరిధిలో వివిధ కేటగిరిలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం కార్మికులు సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి కి వినతిపత్రం అందజేశారు. కార్మికుల వేతనంలో పి.ఎఫ్ కట్ చేసినప్పటికి అకౌంట్ లో సక్రమంగా జమ కావడంలేదని తెలిపారు.
అలాగే 60 సంవత్సరాల పైబడిన వారు, మరణించిన వారి కుటుంబీకులకు వారసత్వ ఉద్యోగాలు, అనారోగ్యం పని చేయని కార్మికుల కుటుంబ వారసులకు ఉద్యోగాలు ఇవ్వగలరని వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర నాయకులు కె. జయచంద్ర, ఘట్ కేసర్ డివిజన్ అధ్యక్షులు లొట్టి ఈశ్వర్, జి. సువర్ణ, మంచాల రామచందర్, టి. శ్రీరాములు, ఎస్. రామ్ కుమార్, కార్మికులు పాల్గొన్నారు.






