17 April, 2026 | 2:15 AM

ఘట్‌కేసర్ సర్కిల్‌లో ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా పర్యటన

17-04-2026 12:07 AM

ఘట్ కేసర్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి) : మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, ఉప్పల్ జోనల్, ఘట్ కేసర్ సర్కిల్ పరిధిలో ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా గురువారం పర్యటించారు. ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధి కాచవానిసింగారం లోని సుప్రభాత్ టౌన్ షిప్, దివ్యానగర్, డాక్టర్స్ కాలనీలలోని పార్కు స్థలాలను సందర్శించి కాలనీ వాసులతో మాట్లాడారు.

పార్కుల అభివృద్ధికి జీహెచ్‌ఎంసీ ప్రత్యేక నిధులు కేటాయించినట్లు  తెలిపారు. పార్కుల అభివృద్ధితో కాలనీలలో మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని, అందుకు స్థానిక కాలనీ అసోసియేషన్స్ వారు పార్కుల అభివృద్ధికి అన్ని విధాల సహకరించాలని ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా సూచించారు. ఈకార్యక్రమంలో టీపీఓ రాజీవ్ రెడ్డి, డీఈ నరేష్, మున్సిపల్ సిబ్బంది, ఆయా కాలనీల ప్రజలు పాల్గొన్నారు.