2 May, 2026 | 6:56 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

నీటి సమస్య పరిష్కరించాలని కమిషనర్‌కు వినతి

12-11-2025 01:20 AM

మేడ్చల్, నవంబర్ 11(విజయ క్రాంతి): మేడ్చల్ పట్టణంలో నీటి సమస్య పరిష్కరించాలని ఐ ఎన్ టి యు సి అధ్యక్షుడు ఎర్ర విజయ రావు ఆధ్వర్యంలో కమిషనర్ చంద్రప్రకాష్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఎస్సీ వాడ, వీకర్ సెక్షన్ కాలనీలలో నీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రెండు మూడు రోజులకోసారి నీరు వస్తోందని పేర్కొన్నారు.

తాము రెక్కాడితే గాని డొక్కాడని అని కూలీలమని ట్యాంకర్ నీరు కొనుగోలు చేసుకోలేమని తెలిపారు. నీటి సమస్యను రెండు మూడు రోజులలో పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారని విజయ రావు తెలిపారు.  నరేందర్, కొమ్ము రాజు, జహంగీర్, షేక్ ఇస్మాయిల్ తదితరులు వినతిపత్రం సమర్పించారు.