calender_icon.png 12 November, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42శాతం రిజర్వేషన్లు సాధించేవరకు పోరాటం ఆగదు

12-11-2025 01:19:30 AM

షాబాద్, నవంబర్ 11 (విజయ క్రాంతి): 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో 31వ రోజు షాబాద్ మండలంలో కొనసాగుతున్నాయి. మంగళవారం రిలే దీక్ష లో భాగంగా మల్లారెడ్డి గూడ గ్రామ పంచాయతీ కి చెందిన పరిగి శేఖర్ గౌడ్,చెందీప జంగయ్య,మీసాల వెంకటయ్య,మాణిక్యం,రాజలింగం,శ్రీనివాస్ లు దీక్ష లో కూర్చున్నారు. ఈ సందర్భంగా సాధన సమితి సభ్యులు తమ్మలి రవీందర్, జడల రాజేందర్ గౌడ్,నర్సింహ లు మాట్లాడుతూ స్థానిక సంస్థ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు వచ్చేంతవరకు తమ పోరాటం ఆగదని వారు పేర్కొన్నారు. మేము ఎంత మాకు అంత వాటా కావాలని వారు డీమాండ్ చేశారు. కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, రాము, గౌరీశ్వర్, చంద్రయ్య, రమేష్ యాదవ్, శ్రీకాంత్, ప్రభాకర్ గౌడ్, సత్తయ్య, జనార్ధన్, మాజిద్, అన్వర్, అంజయ్య  పాల్గొన్నారు.