calender_icon.png 12 November, 2025 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందెశ్రీకి హెచ్‌సీయూ తెలుగుశాఖ నివాళి

12-11-2025 01:20:45 AM

శేరిలింగంపల్లి, నవంబర్ 11 (విజయక్రాంతి): తెలంగాణ జాతీయగీతం రచించిన అందెశ్రీ మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటని, నిరుపేద కుటుంబంలో పుట్టి, తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలగడం సామాన్యమైన విషయం కాదనీ హెచ్ సియు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు వ్యాఖ్యానించారు. అందెశ్రీ మరణానికిసంతాపాన్నితెలుపుతూ అధ్యాపకులందరూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు అనే గేయ రచన ద్వారా మనుషుల్లోని మానవత్వాన్ని తట్టి లేపిన ఒక ఉత్తమ గేయరచయిత అని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తెలిపారు. ఎంతో ప్రతిభావంతుడైన అందెశ్రీకి ఆరోగ్యం సహకరించి ఉంటే ఎన్నో ఉత్తమ గేయాలు రచించి ఉండేవాడని ఆచార్య గోనా నాయక్  అభిప్రాయపడ్డారు.అందెశ్రీ మరణించిన సందర్భంగా హెచ్ సియు తెలుగు శాఖలో ఆచార్య పిల్లలమర్రి రాములు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలుగు శాఖకు చెందిన అధ్యాపకులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య ఎం.గోనానాయక్, ఆచార్య పమ్మి పవన్ కుమార్, ఆచార్య డి.విజయలక్ష్మి, ఆచార్య పి.వారిజారాణి, ఆచార్య త్రివేణి వంగరి, ఆచార్య భూక్య తిరుపతి, డా.బి.భుజంగరెడ్డి,డా.పి.విజయ్ కుమార్, డా.బాశెట్టి లత, డా.డి.విజయకుమారి తదితరులు పాల్గొని వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఘనంగా నివాళులు అర్పించారు.